: జులైలో మోదీ కజికిస్థాన్ పర్యటన... సన్నాహాలు జరుగుతున్నాయన్న ఆ దేశ రాయబారి
తాజాగా మూడు దేశాల పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో నెల తర్వాత మరో దేశంలో పర్యటించేందుకు అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. జులై 7 నుంచి ప్రధాని కజికిస్థాన్ లో పర్యటించనున్నట్టు భారత్ లో ఆ దేశ రాయబారి బులత్ సర్సేన్ బయేవ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పర్యటన వివరాలు, షెడ్యూల్ కు సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులతో వరుస చర్చలు జరుపుతున్నట్టు ఏన్ఐ ఇంటర్య్వూలో తెలిపారు. "జులై 7న కజికిస్థాన్ అధికార పర్యటనపై ఇరు దేశాలు అంగీకరించాయి. ఇది ప్రధాని మోదీ ఘనత. ఈ పర్యటనతో ఇరు దేశా సంబంధాలు మరింత బలపడతాయి, ప్రేరణ ఇస్తుంది" అని ఆ దేశ రాయబారి వివరించారు.