: తమిళనాడు బస్సులను అడ్డుకుంటాం...సరిహద్దు గ్రామాల ప్రజలు


ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య శేషాచలం ఎన్ కౌంటర్ రేపిన వివాదం మరింత ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బస్సులపై దాడులు చేస్తుండడంతో ఏపీఎస్ఆర్టీసీ తమిళనాడుకు బస్ సర్వీసులు నిలిపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీఎస్ఆర్టీసీ 108 కోట్ల రూపాయల నష్టం చవిచూసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు బస్సులు మాత్రం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటుతున్నాయి. దీనిపై సరిహద్దు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన బస్సులు తమ గ్రామాల్లో అడుగుపెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు వరదాయపాళెం గ్రామప్రజలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News