: వరకట్న వేధింపులకు పరాకాష్ఠ... వదినపై మరిది అత్యాచారం


వరకట్న వేధింపులకు పరాకాష్ఠగా భావించే సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. సాక్షాత్తూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుమార్తెపై ఈ దాష్టీకం చోటుచేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 2011లో బెంగళూరుకు చెందిన రిటైర్డు ఐఏఎస్ అధికారి మైసూరులోని ఓ ప్రముఖ కుటుంబంతో వియ్యమందుకున్నారు. అత్తింటి వారు 45 కోట్లు కట్నం తేవాలంటూ ఒత్తిడి చేయడంతో బెంగళూరులో ఉన్న ఇంటిని అమ్మేసి, 15 కోట్ల రూపాయలు అందజేశారు. అయినప్పటికీ ఆమెపై అత్తింటి ఆరళ్లు ఆగలేదు. గర్భిణీ అని కూడా చూడకుండా, బాధితురాలిపై ఆమె మరిది అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. డెలివరీకి కూడా ఆమెను పుట్టింటికి పంపకపోవడం విశేషం. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనివ్వడంతో మనవడిని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు ఆమె విషయం వివరించింది. దీంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News