: మోదీ సర్కారుపై మరికొంతకాలం వేచి చూద్దాం: పారిశ్రామిక వర్గాలకు రతన్ టాటా హితవు


ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై అప్పుడే తీర్పు ఇవ్వవద్దంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా హితవు పలికారు. ముంబైలో హెచ్ డీఎఫ్ సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్, మారికో గ్రూప్ హర్ష్ మారివాలా, సీఐఐ ప్రెసిడెంట్ సుమిత్ మంజుదార్ సహా పలువురు సీఈవోలతో సమావేశమైన సందర్భంగా ఆయన మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం మాత్రమే ముగిసిందని, అప్పుడే పారిశ్రామిక వర్గాలు నిరాశలో పడితే ఎలా? అంటూ ఆయన కాస్త మందలించారు. కాస్త వేచి చూడాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం ప్రకటనలు బాగా చేస్తోందని, చేతల్లో మాత్రం చూపించడం లేదని పారిశ్రామిక వర్గాల ప్రధాన ఆరోపణ. దీంతో మోదీ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News