: బ్యాటింగ్ ఆర్డర్ మారినా...ముంబై కథమారలేదు... 12/3
బ్యాటింగ్ ఆర్డర్ మార్చినా ముంబై ఇండియన్స్ కథ మారలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టుకి నాలుగో బంతికే నెహ్రా షాకిచ్చాడు. ఓపెనర్ పటేల్ ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. దీంతో కేవలం ఒక్క పరుగుకే ముంబై తొలివికెట్ కోల్పోయింది. లెండిల్ సిమన్స్ కి జత కలిసిన కోరె ఆండర్సన్ (4) జాగ్రత్తగా, షాట్ల ఎంపికలో జాగ్రత్త వహించాడు. నెహ్రా విసిరిన గుడ్ లెంగ్త్ బాల్ ను పుల్ చేశాడు. ఈ క్రమంలో డుప్లెసిస్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు పెవిలియన్ చేరాడు. అనంతరం ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన లెండిల్ సిమన్స్ (5) ను సింపుల్ క్యాచ్ తో డుప్లెసిస్ పెవిలియన్ బాటపట్టించాడు. రోహిత్ శర్మ (8) కు హర్బజన్ సింగ్ జతకలిశాడు. ఐదు ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు కేవలం 20 పరుగులు చేసింది.