: ప్రతి కలెక్టర్ కు పది కోట్ల నిధి: కేసీఆర్
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు ఒక్కొక్కరికి పది కోట్ల రూపాయల నిధి ఉండేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాదులో జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, నెలలో ఓ రోజు అర్బన్ డే, మరో రోజు రూరల్ డే గా పాటించాలని సూచించారు. తెలంగాణ పట్టణాల్లో వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను కోరారు. అర్హులకు ఆసరా పింఛన్లు అందచేయాలని ఆయన సూచించారు. అనర్హులను ఏరివేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఇంటికీ టాయిలెట్ నిర్మాణం, పరిశుభ్రంగా ఉండే గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహక గ్రాంట్ అందజేయాలని ఆయన సూచించారు. ఇందుకోసం పది కోట్ల నిధిని కలెక్టర్ల దగ్గర ఉండేలా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు.