: చెన్నైలో సందడి చేసిన సినీ స్టార్లు
చెన్నైలోని టీ నగర్ లో ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ ఇంటి ప్రక్కనే ఉన్న కల్యాణ్ జ్యుయర్స్ షాపింగ్ మాల్ ను ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి దక్షిణాదికి చెందిన సినీ అగ్రహీరోలు హాజరుకావడం విశేషం. కళ్యాన్ జ్యుయలర్స్ కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, కోలీవుడ్ నటుడు ప్రభు, శాండల్ వుడ్ హీరో పునీత్ రాజ్ కుమార్, మాలీవుడ్ హీరో, హీరోయిన్లు హాజరయ్యారు. కల్యాన్ జ్యుయలర్స్ సరసమైన ధరలకు నగలు అందిస్తుందని టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున తెలిపారు. అమితాబ్ తమిళంలో పలకరించి అభిమానులను అలరించారు.