: భక్షక భటులు... సెల్ లో సామూహిక అత్యాచారం!
కంచె చేనును మేసింది. రక్షణ కల్పించాల్సిన భటులే, ఆమె పాలిట భక్షక భటులయ్యారు. అరాచకాల ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం వెలుగు చూసింది. పని చేస్తున్న ఇంట్లో దొంగతనం ఆరోపణలపై అరెస్టై కటకటాల్లో ఉన్న ఓ యువతిపై ఎనిమిది మంది పోలీస్ మృగాలు సామూహిక అత్యాచారానికి తెగబడ్డాయి. తమ రక్షణలో ఉందన్న విచక్షణ మరచిన పోలీసులు ఆమె వద్దువద్దని వేడుకుంటున్నా, కనికరించకుండా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమె భర్త పోలీసుల్ని నిలదీసేందుకు ప్రయత్నించగా, అతనిని అరెస్టు చేసి మూడు రోజులపాటు నిర్బంధించారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు పోలీసులపై ఫిర్యాదు చేయగా, దానిని తీసుకునే నాధుడే కరవయ్యాడు. ఇప్పటి వరకు ఆమెకు వైద్యపరీక్షలు చేయకపోవడం విశేషం.