: నెల్లూరు రైలు ప్రమాదం వెనుక విద్రోహుల చర్య... ఫోరెన్సిక్ నిపుణుల అనుమానం


మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ లో చెన్నై నుంచి బిట్రగుంట వెళ్తున్న రైలు బోగీలు మంటల్లో మాడి మసికావడం వెనుక విద్రోహుల హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన బోగీలను నేడు ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. బోగీ మధ్యలో పెద్ద రంద్రం చేసి ఉండటాన్ని వారు గుర్తించారు. దీంతో, ప్రమాదానికి కారణం షార్ట్‌ సర్క్యూట్‌ కాదని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంపై అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోగా, ప్రాణనష్టం ఏమీ జరగలేదు.

  • Loading...

More Telugu News