: ఢిల్లీ కోర్టు ఆవరణలో న్యాయవాది మృతదేహం... కోర్టు ప్రాంగణంలోనే హత్య చేశారట!


దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు పెరిగిపోతున్నాయి. నిత్యం అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్న రాజధాని నగరంలో హత్యలూ కలకలం రేపుతున్నాయి. నేటి ఉదయం నగరంలోని హజారీ కోర్టు ఆవరణలో ఓ న్యాయవాది మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుడిని న్యాయవాది రాజీవ్ శర్మగా గుర్తించారు. న్యాయవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు ప్రాంగణంలోనే దారుణంగా హతమార్చినట్లు ఆ తర్వాత పోలీసులు నిర్ధారించారు.ఈ ఘటనకు నిరసనగా న్యాయవాదులంతా విధులను బహిష్కరించారని ఢిల్లీ బార్ అసోసియేషన్ సభ్యుడు శర్మ తెలిపారు.

  • Loading...

More Telugu News