: 'మా' ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మురళీ మోహన్


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలను తాజా మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ అధికారికంగా ప్రకటించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ 85 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా తనికెళ్ళ భరణికి 168 ఓట్ల మెజారిటీ వచ్చిందని వివరించారు. జనరల్ సెక్రటరీగా శివాజీ రాజా 36 ఓట్ల మెజారిటీతో, కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు 159 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, సంయుక్త కార్యదర్శులుగా నరేష్ (285 ఓట్లు), రఘుబాబు (239 ఓట్లు) గెలిచారని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా, బెనర్జీ (281 ఓట్లు), బ్రహ్మాజీ (303 ఓట్లు), శాన్వీ (249 ఓట్లు), ఢిల్లీ రాజేశ్వరి (262 ఓట్లు), ఏడిద శ్రీరామ్ (253 ఓట్లు), మహర్షి రాఘవ (255 ఓట్లు), శశాంక్ (283 ఓట్లు), గీతాంజలి (285 ఓట్లు), ఎం హరనాథ్ బాబు (255 ఓట్లు), హేమ (252 ఓట్లు), జాకీ (311 ఓట్లు), జయలక్ష్మి (250 ఓట్లు), కాదంబరి కిరణ్ (312 ఓట్లు), కృష్ణుడు (282 ఓట్లు), నర్సింగ్ యాదవ్ (302 ఓట్లు), పసునూరి శ్రీనివాసులు (245 ఓట్లు), రాజీవ్ కనకాల (315 ఓట్లు), విద్యాసాగర్ (245 ఓట్లు) విజయం సాధించారని తెలిపారు. గెలిచిన ప్యానల్ కు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News