: అకాల వర్షాలతో ఏపీ, తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోయింది: వెంకయ్యనాయుడు


ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో పంటనష్టంపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నివేదిక అందాక కేంద్ర బృందం పర్యటిస్తుందని, తరువాత కేంద్రం నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. ఈ మేరకు హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకయ్య మాట్లాడారు. రైతులకు పంట నష్టపరిహారం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించారన్నారు. ఇక తడిసిన ధాన్యం కొనుగోలుకు తేమ శాతాన్ని 27 శాతానికి పెంచినట్టు చెప్పారు. ఇటీవల సూర్యాపేట కాల్పుల్లో మృతి చెందిన పోలీసులకు శౌర్య పతకాలు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేశామని వెల్లడించారు. ఇదే సమయంలో నిన్న(గురువారం) ఢిల్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విషయంపై మీడియా ప్రస్తావించగా, ఆ వ్యవహారం కాంగ్రెస్ అంతర్గతమని వెంకయ్య ముక్తాయించారు.

  • Loading...

More Telugu News