: సినీ రాజకీయాలను అంతగా పట్టించుకోను... నందమూరి బాలకృష్ణ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లో పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తోంది. ఎక్కడ చూసినా ‘మా’ ఎన్నికల గురించే చర్చ. ఒక్క ఫిల్మ్ నగర్ లోనే ఏంటి, దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కూడలిలోనూ ఈ అంశంపై పెద్ద చర్చే నడిచింది. అయితే టాలీవుడ్ లో ప్రముఖుడుగా వెలుగొందుతున్న నందమూరి బాలకృష్ణ మాత్రం ఆ చర్చకు దూరంగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నిన్న సినీ రాజకీయాలపై కీలక వ్యాఖ్య చేశారు. సినిమా రాజకీయాలను తాను పట్టించుకోనని ఆయన పేర్కొన్నారు. చలన చిత్ర రాజకీయాలను తానెప్పుడూ పట్టించుకోనని కూడా ఆయన చెప్పారు.