: పూర్తయిన 4వ రౌండ్... 46 ఓట్ల ఆధిక్యంలో రాజేంద్ర ప్రసాద్... గెలుపు ఖాయమే!
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక దాదాపు ఖాయమైనట్టే. మొత్తం 7 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు జరగనుండగా, ఇప్పటివరకూ 4 రౌండ్లు పూర్తయ్యాయి. 4వ రౌండ్ ముగిసేసరికి రాజేంద్ర ప్రసాద్, తన సమీప ప్రత్యర్థి, సహజ నటి జయసుధపై 46 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.