: శత్రు విధ్వంసక 'ఐఎన్‌ఎస్ విశాఖపట్నం'!
మరో రెండు రోజుల్లో జాతికి అంకితం కానున్న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విశాఖపట్నం గురించి మరిన్ని విశేషాంశాలు బయటకు వచ్చాయి. రూ. 29,340 కోట్ల రూపాయల వ్యయం కాగల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ శత్రు విధ్వంసక యుద్ధ నౌక 163 మీటర్ల పొడవుంది, 7,300 టన్నుల బరువుతో, గంటకు 30 నాట్ల వేగంతో (సుమారు 55 కిలోమీటర్లు) దూసుకుపోతుంది. ఇండియా లోనే ఇది అతిపెద్ద యుద్ధ నౌక. 16 నౌకా విధ్వంసక బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శత్రువులపై తుపాకి గుళ్ల వర్షం కురిపించడానికి ఐఎన్‌ఎస్ విశాఖలో 127 ఎంఎం గన్నులు అందుబాటులో ఉంటాయి. ఏకే-630 యాంటీ మిసైల్ గన్ సిస్టమ్ ఉంది. సాంకేతిక పరంగా, ఇంటిగ్రేటెడ్ ప్లాట్ ఫామ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐపీఎంఎస్), షిప్ డేటా నెట్‌వర్కింగ్ (ఎస్డీఎన్), ఆటోమేటిక్ పవర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ఏపీఎంఎస్), కాంబాట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (సీఎంఎస్) వంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. అణు, జీవ, రసాయన వంటి ఎలాంటి యుద్ధంలోనైనా సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటుంది.