: తానా ఎన్నికలకు రంగం సిద్ధం... సతీశ్ వేమన, రామ్ యలమంచిలి మధ్య హోరాహోరీ పోరు


తెలుగు అసోసియేషన్ ఆప్ నార్త్ అమెరికా (తానా) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రేపు, ఎల్లుండి జరగనున్న ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న ఊహాగానాలు సాగుతున్నాయి. రేపటి నుంచి రెండు రోజుల్లో పోలింగ్ పూర్తి కానున్న ఈ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 25న బోస్టన్ లో జరగనుంది. రెండేళ్లకోమారు జరిగే తానా ఎన్నికల్లో... ఈ దఫా సతీశ్ వేమన, రామ్ యలమంచిలి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో మొత్తం 20 వేల మంది తానా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుత కార్యవర్గంలోని 70 మంది సభ్యుల మద్దతు సతీశ్ వేమనకు ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ యలమంచిలి వర్గం కూడా ఈ దఫా ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారీ కసరత్తే చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మునుపటి ఎన్నికలకు భిన్నంగా ఈ దఫా ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయని తానా సభ్యులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News