: మనకంటే ఎంతో పురోగతి సాధించిన గ్రహాంతర వాసులున్నారు: శాస్త్రవేత్తలు


గెలాక్సీల్లో గ్రహాంతరవాసులు ఉండవచ్చని పెన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్ లో వారు మాట్లాడుతూ, గుర్తించిన గెలాక్సీల్లో కొన్ని అసాధారణ రీతిలో అధిక స్థాయుల్లో వికిరణాన్ని వెదజల్లుతున్నాయని, ఆయా గెలాక్సీల్లో గ్రహాంతర వాసులు మనిషి కంటే ఎంతో పురోగతి సాధించి ఉండవచ్చని ఖగోళశాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. భూమి వేడి, కాంతిని అంతరిక్షంలోకి ఎలా పంపిస్తుందో, అక్కడి గ్రహాంతర వాసులు కూడా అదేవిధంగా పంపాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. దీనిపై పరిశోధనలు చేస్తున్నప్పుడు, అసాధారణ రీతిలో అధిక స్థాయుల్లో మధ్య తరహా పరారుణ కిరణాలు వెదజల్లుతున్న 50 గెలాక్సీలను తాము గుర్తించామని వారు తెలిపారు. దీనిని బట్టి అక్కడ ఏలియన్లు ఉన్నాయని భావిస్తున్నామని వారు సూత్రీకరించారు. అయితే ఆయా గెలాక్సీలు వెదజల్లుతున్న పరారుణ కిరణాలు ఏలియన్లు పంపినవా? లేక సహజ ఖగోళ సంబంధ ప్రక్రియవల్ల జనిస్తున్నాయా? అనేది నిర్ధారించాల్సి ఉందని, తమ తదుపరి పరిశోధనల్లో దీనిని కనుగొంటామని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News