: 838 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల అడ్మిషన్లు రద్దు
ఆంధ్రప్రదేశ్ లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు నిబంధనలు ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు పొందిన 838 మంది విద్యార్థుల అడ్మిషన్లు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి అడ్మిషన్లు చేసిన కళాశాలలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ కళాశాలలు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వలేదని అధికారులు తెలిపారు. దీంతో, ఈ కళాశాలలు బీ కేటగిరీలో ప్రవేశాలకు ప్రకటన చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కారణంగా వారి అడ్మిషన్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.