: కనీస వేతనంపై రోడ్డెక్కిన 15 వేల మంది
కనీస వేతనం పెంచాలంటూ అమెరికాలో భారీ ఆందోళన రేగింది. న్యూయార్క్ లో 15 వేల మంది రోడ్లపై ఆందోళన నిర్వహించారు. గంటకు కనీసం 15 డాలర్లు చెల్లించాలంటూ నిరసనకారులు గొంతెత్తారు. ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, చిన్నారుల సంరక్షణ కేంద్రాల్లో పనిచేసేవారు, భవన నిర్మాణ కార్మికులు సహా వివిధ రంగాల అసంఘటిత కార్మికులు, అమెరికాలోని 230 నగరాల్లోనుంచి న్యూయార్క్ వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రస్తుతం అమెరికాలో గంటకు 8.75 డాలర్లు కనీస వేతనంగా చెల్లిస్తున్నారు. జీవన వ్యయం పెరగడంతో కనీస వేతనం 15 డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, కార్మికులంతా ఆందోళన బాటపట్టారు.