: ఇస్లామిక్ రాజ్య స్థాపన ఇంత ఘోరమా?: వెలుగు చూసిన ఐఎస్ అకృత్యం


ఇస్లామిక్ రాజ్యస్థాపన కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ, ఇస్లామిక్ రాజ్యమంటే ఇంత ఘోరమా? అనే అభిప్రాయం కలిగిస్తున్నాయి. ఐఎస్ తీవ్రవాదుల చెరనుండి అతి కష్టం మీద తప్పించుకున్న యాజాదీ తెగకు చెందిన 20 మంది యువతులను హ్యూమన్ రైట్స్ వాచ్ ఇంటర్వూ చేసింది. అందులో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. వారిపై జరిగిన రాక్షసత్వాన్ని వింటే ఐఎస్ఐఎస్ అన్నా, ఇస్లాం అన్నా ఏ భావం కలుగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వివరాల్లోకి వెళితే... సిరియాలోని సిజార్ గ్రామంలోని యాజాదీ తెగకు చెందిన ఓ కుటుంబాన్ని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అపహరించారు. ఆ యువతితో పాటు నిండా 12 ఏళ్లు నిండని మరికొంత మందిని కూడా కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. వారిని తాము చెప్పింది చేయమన్నారు. దీనికి బాలికలు అంగీకరించకపోవడంతో, వారిని కట్టేసి చితక్కొట్టారు. స్నానం చేసి తయారవుతామని వారు ప్రాధేయపడడంతో వారిని కాసేపు వదిలేశారు. దీంతో ఆ గదిలో టాక్సిక్ యాసిడ్ డబ్బాలు కనపడడంతో చచ్చిపోదామని వారంతా దానిని తాగేశారు. అయితే వారు అస్వస్థతకు గురయ్యారే తప్ప, ప్రాణాలు కోల్పోలేదు. అయినా ఆ తీవ్రవాదులు వారిని వదల్లేదట, ఆ ఏడుగురు ఉగ్రవాదులు వంతుల వారిగా వారిని అత్యంత దారుణంగా రేప్ చేశారు. ఎనిమిదేళ్ల నుంచి 12 ఏళ్లలోపున్న ఆ బాలికలను చిత్రహింసలకు గురిచేసి, వంతులు వారీగా అత్యాచారం చేసేవారట. లాటరీలు వేసుకుని అత్యాచారం చేయడమే కాకుండా, తమ అనుకూల గ్రామాల్లోని ఇతరులకు కూడా వారిని ఎరగా వేసేవారట. ఒళ్లంతా పుండైపోతున్నా, మరణాన్ని కోరుకుంటున్నా దేవుడు కరుణించకపోవడంతో క్షణమొక యుగంలా గడిపారట. దొరికిన ఓ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో వారంతా అక్కడి నుంచి పారిపోయి మానవహక్కుల సంఘ కార్యకర్తలను కలిశారు. ఇదీ ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఇస్లామిక్ రాజ్యస్థాపన కథ!

  • Loading...

More Telugu News