: యువతిని అడగకూడని ప్రశ్నలడిగిన ఢిల్లీ ఇమిగ్రేషన్ అధికారి అరెస్టు
న్యూఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికురాలిని అడగకూడని ప్రశ్నలు అడిగి వేధించిన ఇమిగ్రేషన్ అధికారి వినోద్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. గత నెల 18న హాంకాంగ్ వెళ్లేందుకు వచ్చిన బెంగళూరుకు చెందిన యువతిని ఇబ్బందికరమైన ప్రశ్నలతో వినోద్ వేధించాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఎంతమంది పిల్లలు? మద్యం తాగుతావా? సిగరెట్ అలవాటుందా? చికెన్ తింటావా? భర్త కాకుండా మరెవరితోనైనా సంబంధం ఉందా? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిందా? నాతో కలసి మూడో బిడ్డను కంటవా? వంటి ప్రశ్నలతో వేధించాడు. మాటలతోను, చేతలతోనూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టాడు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టగా, ప్రాథమిక ఆధారాలు లభించడంతో అదుపులోకి తీసుకున్నారు.