: మీ భూములు అమ్మద్దు... కౌలుకు కూడా ఇవ్వద్దు!: కోర్టుకు వెళ్లిన రాజధాని ప్రాంత రైతులకు కోర్టు ఆదేశం
రాజధాని భూ సమీకరణను సవాల్ చేస్తూ ఆరుగురు రైతులు, నేషనల్ అలియెన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. పిటిషన్ దాఖలు చేసిన రైతులు తమ భూములు అమ్మకూడదని, అంతేగాక కౌలుకు కూడా ఇవ్వకూడదని రైతులను కోర్టు ఆదేశించింది. వ్యవసాయం మినహా ఇతర అవసరాలకు దానిని వినియోగించరాదని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో సంస్థ ప్రమేయాన్ని ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. భూముల సమీకరణలో భూములు ఇవ్వని వారిపై ప్రభుత్వం తరపున ఏఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. చట్ట ప్రకారం భూ సమీకరణకు వెళ్తామని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణకు కోర్టు జులై మొదటి వారానికి వాయిదా వేసింది.