: జే&కేలో మస్రత్ ఆలంను అరెస్టు చేయాలంటూ కాంగ్రెస్, శివసేన ర్యాలీ


జమ్మూ కాశ్మీర్ జైలు నుంచి విడుదలైన మస్రత్ ఆలం శ్రీనగర్ లో చేపట్టిన భారత వ్యతిరేక ర్యాలీపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజ్యాంగ నిబంధన ఉల్లంఘించిన మస్రత్ ఆలంను తక్షణం అరెస్టు చేయాలంటూ విపక్షాలు శ్రీనగర్ లో ఆందోళన నిర్వహించాయి. కాంగ్రెస్, శివసేన పార్టీలు ర్యాలీ నిర్వహించాయి. కాగా, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి కేంద్ర హోం మంత్రి తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. మస్రత్ ఆలంపై ఏ చర్యలు తీసుకుంటున్నారో సమగ్ర నివేదిక అందించాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News