: పట్టిసీమ ప్రాజెక్టులో చంద్రబాబుకు రూ.300 కోట్ల ముడుపులు అందాయి: జగన్


రాయలసీమకు నీరందించే నిమిత్తం నిర్మించ తలపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ.300 కోట్ల ముడుపులు అందాయని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్దకు జగన్ బస్సుయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు ఇంజినీర్లు, రైతులతో ఆయన మాట్లాడారు. అనంతరం ప్రసంగిస్తూ, "ప్రకాశం బ్యారేజ్ లో నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలే ఉందని ఇక్కడి ఇంజినీర్లు నాకు చెప్పారు. ఈ పరిస్థితుల్లో గోదావరి నది నుంచి నీరు వస్తే నిల్వచేయడం ఎలా సాధ్యమవుతుంది?" అని జగన్ మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాధారణంగా వర్షాకాలంలో కృష్ణా, గోదావరి నదులు పొంగుతూ ఉంటాయని, అందులో కొంత నీరు సముద్రంలోకి వెళుతుందని అన్నారు. అలా వ్యర్థంగా పోయే నీటిని పోలవరం ప్రాజెక్టు ద్వారా నిల్వ చేయొచ్చని, పట్టిసీమ ప్రాజక్టు ద్వారా చేయలేమని పేర్కొన్నారు. పోలవరంతో 124 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చని వివరించారు. కానీ ప్రభుత్వం అలాంటి ఉపయోగకరమైన ప్రాజెక్టును పక్కన పెట్టాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. పట్టిసీమ పూర్తయితే కర్ణాటక, మహారాష్ట్రలు మనకు 35 టీఎంసీల నీటిని విడుదల చేయడం ఆపివేస్తాయని, ఇవన్నీ పూర్తిగా తెలిసిన చంద్రబాబు ప్రాజెక్టుపై ముందుకు వెళుతున్నారని, కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేందుకే ఇలా చేస్తున్నారని జగన్ విమర్శించారు.

  • Loading...

More Telugu News