: ప్లే స్కూల్ పిల్లల సాక్షిగా టీచర్ ని పొట్టనబెట్టుకున్నాడు!


అర్జెంటీనాలోని కొరడోబా ప్రావిన్స్ లో ఓ ప్లేస్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. ఆ స్కూల్ లో మూడు నాలుగేళ్ల వయసున్న చిన్నారుల ఎదురుగా ఓ వ్యక్తి టీచర్ ను కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అతనికి మతి స్థిమితం లేదని, అతను కత్తితో పొడిచి చంపింది సాక్షాత్తూ అతని భార్యనేనని పోలీసులు తెలిపారు. అతను వ్యాపారి అని, కొంత కాలంగా మానసికవ్యాధితో బాధపడుతున్నాడని వారు వెల్లడించారు. కాగా, ఆ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ హత్యతో తల్లి అనంతలోకాలకెళ్లిపోతే, తండ్రి జైలుకెళ్లనున్నాడు.

  • Loading...

More Telugu News