: ఎంఐ-4 స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గించిన జియోమీ
ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మరింత వాటా నమోదు చేసే లక్ష్యంతో, తామందించిన ఎంఐ-4 స్మార్ట్ ఫోన్ ధరను రూ. 2 వేల రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మారిన ధరల ప్రకారం రూ. 19,999గా ఉన్న 16 జిబి స్మార్ట్ ఫోన్ ధర రూ. 17,999కు, రూ. 23,999గా ఉన్న 64 జిబి స్మార్ట్ ఫోన్ ధరను రూ. 21,999కు తగ్గిస్తున్నట్టు నేడు తెలిపింది. ఇప్పటివరకూ ఫ్లిప్ కార్ట్, మొబైల్ స్టోర్ లలో లభించిన ఫోన్ ఇకపై స్నాప్ డీల్, అమెజాన్ లోనూ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.