: కృష్ణా జిల్లాలో ఈషా ఫౌండేషన్ కు 400 ఎకరాల భూమి... మంత్రి గంటా ప్రకటన
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈషా ఫౌండేషన్ కు ఏపీ సర్కారు పెద్ద పీట వేస్తోంది. నవ్యాంధ్ర రాజధాని సమీపంలో 400 ఎకరాల భూమిని అప్పగించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు నేటి ఉదయం ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేశారు. కృష్ణా జిల్లాలో ఈషా ఫౌండేషన్ కు 400 ఎకరాల భూమిని అప్పగించనున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ స్థలంలో ఓ అంతర్జాతీయ స్థాయి పాఠశాలతో పాటు న్యాయ కళాశాల, శిక్షణా కేంద్రాలను ఈషా ఫౌండేషన్ ఏర్పాటు చేస్తుందని కూడా మంత్రి తెలిపారు.