: కాశ్మీర్లో పాక్ జెండాల రెపరెపలపై ముఫ్తీకి రాజ్ నాథ్ సీరియస్ వార్నింగ్


కరుడుగట్టిన వేర్పాటువాది మస్రత్ ఆలం శ్రీనగర్ లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మద్దతుదారులు పాకిస్థాన్ జండాలతో భారత వ్యతిరేక నినాదాలు చేయడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై తక్షణం కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ను ఆదేశించారు. "దేశ భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదని, రాజకీయాలు వేరు, భద్రతాంశాలు వేరు" అని ఆయన అన్నారు. ఈ తరహా ఘటనలు సహించబోమని హెచ్చరించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News