: సూర్యాపేట షూటర్స్ అడ్డా...మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డి!


సూర్యాపేట షూటర్స్ గా తెలంగాణ పోలీసులతో పాటు ఏపీ పోలీసులనూ పరుగులు పెట్టించిన సిమీ ఉగ్రవాదులు ఎజాజ్, అస్లాం అడ్డా హైదరాబాదు కాదట. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డి నుంచి వారు కార్యకలాపాలను సాగించారట. పోలీసుల దర్యాప్తులో తాజాగా దిగ్భ్రాంతి కలిగించే ఈ విషయం వెలుగు చూసింది. ఓ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నామని చెప్పుకున్న ఎజాజ్, అస్లాంలు సంగారెడ్డిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారట. సంగారెడ్డి నుంచి హైదరాబాదు మీదుగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లోనూ వారు పలుమార్లు పర్యటించారట. ఈ మేరకు పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు, సంగారెడ్డిలో ఉగ్రవాదులు అద్దెకు తీసుకున్న గదిని కూడా గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విస్తుగొలిపే నిజాలు వెల్లడి కావచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News