: విశాఖలో నేడు క్రికెట్ సంబరం... రాజస్థాన్ తో తలపడనున్న సన్ రైజర్స్


విశాఖపట్నంలో నేడు క్రికెట్ పండుగ జరగనుంది. ఐపీఎల్-8లో భాగంగా నేడు విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాదు తలపడనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుబోయాయి. దీంతో నేడు విశాఖలో క్రికెట్ క్రేజ్ హోరెత్తనుంది. ఇదిలా ఉంటే, ఆడిన మూడు మ్యాచ్ లలో విజయం సాధించి ఊపుమీదున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న ఈ మ్యాచ్ లో... గత మ్యాచ్ లో విజయంతో సరికొత్త ఉత్సాహంతో సన్ రైజర్స్ హైదరాబాదు ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి దిగనుంది.

  • Loading...

More Telugu News