: ప్రతిసారిలా కాకుండా ఇప్పుడు పూర్తి స్పీచ్ తో వచ్చాను: మణిరత్నం


గతంలో ప్రతి సినిమా ఆడియో వేడుకలో వచ్చేసారి తెలుగులో మాట్లాడుతానని చెప్పేవాడినని, ఈ సారి మాత్రం తెలుగులో మాట్లాడాలని ఫుల్ స్పీచ్ తో తయారై వచ్చానని ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెలుగులో చెప్పారు. అయితే సిరివెన్నెల లాంటి వాళ్లు మాట్లాడిన తరువాత తాను తెలుగులో మాట్లాడడం సరికాదని అన్నారు. 'ఓకే బంగారం' సినిమాలో నటించిన నిత్యామీనన్, దుల్ఖర్ అద్భుతంగా నటించారని, నాని చాలా బాగా డబ్బంగ్ చెప్పాడని అన్నారు. దిల్ రాజు సినిమాని నిర్మించడం శుభసూచకమని ఆయన చెప్పారు. ఈ సారి పూర్తిగా తెలుగు మాట్లాడుతానని, సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర తెలుగు స్పష్టంగా నేర్చుకుంటానని మణిరత్నం ధీమాగా చెప్పారు.

  • Loading...

More Telugu News