: సెమీస్ లో వెనుదిరిగినా రెండోస్థానంలో టీమిండియా


ప్రపంచకప్ పోటీల్లో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన భారత్ వన్డే ర్యాంకింగ్స్ లో మాత్రం మెరుగ్గానే కొనసాగుతోంది. ఓటమన్నదే తెలియకుండా సెమీస్ కు చేరుకోవడంతో టీమిండియా నెంబర్ టూ ర్యాంకును కోల్పోలేదు. ఆసీస్ లో వన్డే సిరీస్ తో ఘోరపరాజయం చెందిన టీమిండియా ర్యాంకింగ్ పాయింట్లు దిగజారాయి. అయితే, వరల్డ్ కప్ లో చూపిన పోరాటపటిమతో టీమిండియా ర్యాంకింగ్ లో ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం. వరల్డ్ కప్ టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా 122 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, 116 పాయింట్లు సాధించిన టీమిండియా ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. 112 పాయిట్లు సాధించిన సౌతాఫ్రికా తృతీయ స్థానంలోనూ, శ్రీలంక 108 పాయింట్లతో నాలుగో స్థానంలోనూ, న్యూజిలాండ్ 107 పాయింట్లతో ఐదోస్థానంలో నిలిచాయి. లీగ్ దశలోనే వెనుదిరిగిన ఇంగ్లండ్ 101 పాయింట్లు సాధించి, ఆరో స్థానంలో నిలిస్తే, పాకిస్థాన్ కేవలం 95 పాయింట్లు సంపాదించి ఆ తరువాతి స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News