: అప్పుడే పుట్టిన జిరాఫీని చూసేందుకు నెటిజన్ల క్యూ... 20 లక్షలు దాటిన హిట్లు
యానిమల్ ప్లానెట్ లో పెట్టిన ఓ పోస్టింగ్ కు హిట్ల మీద హిట్లు వెల్లువెత్తుతున్నాయట. ఆ పోస్టింగ్ లో ఓ జిరాఫీ బుజ్జి జిరాఫీకి జన్మనివ్వడం, సదరు బుజ్జి జిరాఫీ తల్లి ఒడిలో వొదిగిన తీరు, గెంతుతూ తల్లి చుట్టు ఆడుకుంటున్న దృశ్యాలున్నాయి. శుక్రవారం యానిమల్ ప్లానెట్ లోకి వచ్చిన ఈ పోస్టింగ్ ను సోమవారం నాటికే 20 లక్షల మంది నెటిజన్లు చూసేశారట. అమెరికాలోని డాలస్ జూలో జిరాఫీ ప్రసవాన్ని చిత్రీకరించేందుకు జూ అధికారుల అనుమతి తీసుకున్న యానిమల్ ప్లానెట్, వారం పాటు వేచి ఉండి మరీ ఈ వీడియోను చిత్రీకరించిందట. ‘‘ఇది చాలా పెద్ద విషయం. తెర వెనుక ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలియాలి. అందుకే ప్రధానమైన జూకి ప్రతినిధులుగా యానిమల్ ప్లానెట్ ఛానెల్ కు అనుమతినిచ్చాం’’ అని జూ ప్రతినిధి లూరీ హాలోవే చెప్పారు.