: వయసు పైబడిన రైతులకు రూ.5000 పింఛన్: రాజ్ నాథ్ సింగ్
అరవై సంవత్సరాలు లేదా అంతకంటే వయసు పైబడిన రైతులకు సామాజిక, ఆర్థిక భద్రతకోసం నెలకు రూ.5,000 పింఛన్ ఇవ్వబోతున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. పాట్నాలో ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా మాట్లాడిన రాజ్ నాథ్, "నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి నెలవారీ పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. రైతుల పట్ల జాగ్రత్త వహించడం, వారికి సాయం చేస్తున్న తొలి ప్రభుత్వం బహుశా మోదీ సర్కారే కావొచ్చు" అని అన్నారు. కాగా అరవై ఏళ్ల వయసులో ముఖ్యంగా రైతుల్లో కష్టపడే తత్వం తగ్గిపోతుంది. అందుకే వారికి పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.