: స్పెయిన్ వీధుల్లో నిరసన తెలిపిన మానవ 'త్రీడీ హోలోగ్రాం' ప్రతిరూపాలు
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ వీధుల్లో వేలాది మంది నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టారు. అయినా పోలీసులు వీరిని తాకను కూడా తాకలేకపోయారు. అసలు వీరు మనుషులైతేగా!... వీరంతా ప్రజల త్రీడీ హోలోగ్రాం ప్రతిరూపాలు. స్పెయిన్ లో ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేసే హక్కును తొలగిస్తూ, అక్కడి ప్రభుత్వం 'గ్యాగ్' పేరిట ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని తీవ్రంగా నిరసిస్తున్న ప్రజలు, ఉద్యోగులు వెబ్ క్యాబ్ ద్వారా తమ హోలోగ్రాంలను పంపించారు. వీటితో ఏకంగా పార్లమెంట్ భవనం ముందే ర్యాలీని చేపట్టి విజయవంతం చేశారు. అందివచ్చిన అధునాతన సాంకేతికత అందుబాటులో ఉంటే ఇంతే మరి. మానవ 'త్రీడీ హోలోగ్రాం' ప్రతిరూపాలతో ధర్నా నిర్వహించడం ప్రపంచంలో ఇదే మొదటిసారట.