: ‘ముంబై’కి హ్యట్రిక్ పరాజయం... ‘రాయల్స్’ చేతిలో ఏడు వికెట్ల తేడాతో చిత్తు!


నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్... విజయం సాధించిన జట్టుతో పాటు పరాజయంపాలైన జట్టుకూ ‘హ్యాట్రిక్’ ను కట్టబెట్టింది. ఐపీఎల్-8 లో వరుస విజయాలతో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్ కు ఈ మ్యాచ్ హ్యాట్రిక్ విజయాన్ని అందివ్వగా, పరాజయాలతో కుదేలవుతున్న ముంబై ఇండియన్స్ కు హ్యాట్రిక్ పరాజయాన్ని కట్టబెట్టింది. అహ్మదాబాదులోని మోతేరా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయినా, కీరన్ పొలార్డ్(70), కోరీ ఆండర్సన్(50) రాణించడంతో ఆ మేర స్కోరైనా చేయగలిగింది. ఆ తర్వాత 165 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్, ఇంకో ఐదు బంతులు మిగిలుండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి హ్యాట్రిక్ విజయం సాధించింది. ఓపెనర్ అజింక్యా రెహానే (46) శుభారంభాన్నిచ్చాడు. ఆ తర్వాత స్టీవెన్ స్మిత్ (79) విశ్వరూపం ప్రదర్శించడంతో ముంబై ఇండియన్స్ తోకముడవక తప్పలేదు.

  • Loading...

More Telugu News