: రోహిత్ శర్మ డకౌట్... కష్టాల్లో ముంబై ఇండియన్స్!


ముంబై ఇండియన్స్ కు కాలం కలిసివచ్చినట్లు లేదు. ఐపీఎల్-8 సీజన్ లో భాగంగా కొద్దిసేపటి క్రితం అహ్మదాబాదులోని మోతేరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గా వచ్చిన ఆరోన్ ఫించ్(10) రిటైర్డ్ హర్ట్ కాగా, ఆ వెనువెంటనే మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్ (16) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఉన్ముక్త్ చంద్ తో కలిసి క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు బంతులెదుర్కొని పరుగులేమీ చేయకుండానే డకౌటయ్యాడు. దీంతో 31 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఉన్మక్త్ చంద్ (7)కు కోరీ ఆండర్సన్ (5) జతకలిశాడు. 8 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్ 38 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News