: సముద్ర మార్గం ద్వారా చొరబడ్డ లష్కరే తోయిబా ఉగ్రవాదులు!... ముంబైలో హై అలర్ట్
ముంబై నగరంలోకి అరేబియా సముద్రం ద్వారా లష్కరే తోయిబా ఉగ్రవాదులు వచ్చారన్న సమాచారం అందింది. దీంతో ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్ లతో పాటు అణువణువునా పోలీసులు, భద్రతా దళాలు తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఉండొచ్చని, వీరి లక్ష్యం రైల్వే స్టేషన్లే నని, స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ముంబైలోని 17 ప్రధాన స్టేషన్లకు ఆర్పీఎఫ్ అధికారులు సర్క్యులర్ జారీ చేయగా, వేలాది మంది పోలీసులు రహదార్లపై మోహరించి తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.