: అంతా వజ్రాలమయం... కళ్ళు ధగధగలాడేలా బ్రూనై ప్రిన్స్ వివాహం
దశాబ్దం క్రితం వరకూ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచిన బ్రూనై సుల్తాన్ కుమారుడు, యువరాజు అబ్దుల్ మాలిక్ (31) వివాహం రాబియాతుల్ (22)తో వైభవంగా జరిగింది. వధూవరులు బంగారు దారాలతో నేసి, వజ్రాలు పొదిగిన వస్త్రాలు ధరించారు. ఇద్దరూ వజ్రాలు, ఖరీదైన నవరత్నాల వెలుగుల్లో ధగధగలాడారు. సిస్టమ్ డేటా ఎనలిస్ట్ గా పనిచేస్తున్న వధువు చేతిలోని బొకే కూడా ఖరీదైన రత్నాలతో తయారు చేసిందే. చెప్పులు కూడా వజ్రాలు పొదిగినవే. మొత్తం 11 రోజులు సాగనున్న వివాహ వేడుకల్లో ప్రధాన ఘట్టం పూర్తి కాగా, 15న వేడుకలు ముగియనున్నాయి.