: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో క్రిస్ గేల్!


టెస్టు, వన్డే, టీ20... ఫార్మాట్ ఏదైనా, తనదైన శైలితో దుమ్మరేపే కరీబియన్ క్రికెటర్ క్రిస్ గేల్ క్రీజులో ఉంటే, బౌలర్లకు గుండె దడే. ఇక స్టాండ్స్ లోని ప్రేక్షకులతో పాటు టీవీక్షకులకు కూడా కన్నుల పండుగే. వచ్చీ రావడంతోనే సిక్స్ లతో విరుచుకుపడే గేల్, ఐపీఎల్ లో అరుదైన రికార్డుకు కేవలం అడుగు దూరంలో నిలిచాడు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్ లో 26 సిక్స్ లు బాదిన గేల్, ఆ మెగాటోర్నీలో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. నేడు సన్ రైజర్స్ హైదరాబాదుతో జరగనున్న మ్యాచ్ లో ఒక్క సిక్స్ కొడితే, అతడు ఐపీఎల్ లో 200 సిక్స్ లు బాదిన క్రికెటర్ గా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటిదాకా ఐపీఎల్ లో 69 మ్యాచ్ లు ఆడిన గేల్, 199 సిక్స్ లు కొట్టాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో అతడు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. మరికొద్దిసేపట్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్, సన్ రైజర్స్ తో తలపడనుంది.

  • Loading...

More Telugu News