: ‘చమురు’ ఒడిదుడుకులు అరబ్ షేక్ లను ‘షేక్’ చెయ్యడం లేదట!


ముడి చమురు మార్కెట్లో ధరలు ఇటీవలి కాలంలో భారీగా తగ్గాయి. అంతేకాక ధరలు ఒక్కచోట స్థిరంగా ఉండటం లేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో భారత్ లో వంద రూపాయలకు చేరువైన లీటరు పెట్రోల్ ధర ఒకానొక సమయంలో రూ.60 కంటే తగ్గింది. ఈ క్రమంలో చమురు నిల్వలే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న అరబ్ షేకుల ఆదాయం భారీగా తగ్గుతుందని అందరూ భావించారు. అయితే తమను కాదు కదా, తమ ఆదాయాన్ని కూడా ఆ కుదుపులు ఏమీ చేయలేవని అరబ్ షేకులు చెబుతున్నారు. వారే కాదండోయ్, ప్రపంచ కుబేరుల ఆస్తిపాస్తులను లెక్కగట్టే ఫోర్బ్స్ మేగజీన్ ‘‘ఆయిల్ షాకులు... అరబ్ షేకులను షేక్ చేయలేదు’’ అని తేల్చేసింది. అరబ్ షేకుల ఆదాయం క్రమంగా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని ఆ మేగజీన్ చెప్పింది. మరో ఆసక్తికర అంశమేంటంటే, ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ టాప్ 100 జాబితాలోకి కొత్తగా 15 మంది అరబ్ షేకులు స్థానం సంపాదించారట. అరబ్ షేకుల సంపద గతేడాది కాలంలోొ 830 కోట్ల డాలర్ల మేర పెరిగి 17,437 కోట్ల డాలర్లకు పెరిగిందట. ఇక అరబ్ షేకుల్లో అపర కుబేరుడిగా వెలుగొందుతున్న సౌదీ అరేబియా యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ ఈ సారి కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలోనే ఉన్నారు.

  • Loading...

More Telugu News