: హుస్సేన్ సాగర్ లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... ప్రియురాలి మృతి
వారి ప్రేమకు ఎవరైనా అడ్డు చెప్పారో, లేక కలసి బతకలేక పోయినప్పుడు కనీసం కలసి మరణిద్దామని భావించారో, ఆ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. వారిద్దరూ హైదరాబాదు నడిబొడ్డులోని హుస్సేన్ సాగర్ లో దూకి ఈ ఉదయం ఆత్మహత్యాయత్నం చేశారు. తక్షణం స్పందించిన లేక్ పోలీసులు వారిని బయటకు తెచ్చారు. అప్పటికే ప్రియురాలు మృతి చెందింది. ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.