: జర్మనీ వీధుల్లో గర్జిస్తున్న భారత సింహం!
'మేక్ ఇన్ ఇండియా' పేరిట ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రచారం పట్ల జర్మనీ పారిశ్రామికవేత్తలు అమిత ఆసక్తిని చూపుతున్నారు. భారత్ ప్రధాన భాగస్వామిగా 'హనోవర్ ఫెయిర్ 2015' ప్రదర్శనను ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్స్ లర్ మెర్కెల్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల 'మేక్ ఇన్ ఇండియా' సింహం లోగో ప్రజలకు కనపడేలా పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. సుమారు 400 భారత కంపెనీలు వారంపాటు జరిగే ప్రదర్శనలో భాగం పంచుకుంటుండగా, 100 నుంచి 120 కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. 'హనోవర్ లో సింహం గర్జిస్తోంది. ప్రపంచ వేదికపై మేక్ ఇన్ ఇండియా సత్తా చాటుతోంది' అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. 'హనోవర్ ఫెయిర్ ముగియగానే, భారత్ లో కొత్త పెట్టుబడుల దిశగా మరిన్ని తలుపులు తెరచుకోనున్నాయి' అని ఆయన అన్నారు.