: దయచేసి ఆ పని చేయొద్దు...!: ట్రాయ్ కి లక్ష మెయిల్స్ తో స్మార్ట్ ఫోన్ ప్రియుల వినతుల వెల్లువ
వాట్స్ యాప్, ఫేస్ బుక్, ఫ్లిప్ కార్ట్ వంటి కొన్ని యాప్ లు, వెబ్ సైట్లను వాడే స్మార్ట్ ఫోన్ వినియోగదారుల నుంచి ప్రత్యేక చార్జీలు వసూలు చేయాలని, మరి కొన్ని యాప్స్ పై నిషేధం విధించాలని ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) చేస్తున్న ప్రయత్నాలకు గట్టి దెబ్బ తగిలింది. దయచేసి ఇంటర్నెట్ స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయవద్దని మొబైల్ యాప్స్ ప్రేమికులు సుమారు లక్ష మెయిల్స్ ను ట్రాయ్ కి పంపారు. పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం మెయిల్స్ పంపిన వారిలో ఉండటం గమనార్హం. కొత్త ప్రతిపాదనలు చేస్తున్న ట్రాయ్, ఈ మేరకు వారంలోగా అభిప్రాయాలు తెలపాలని కోరగా, నెట్ వినియోగదారులు స్పందించి అటువంటి ప్రయత్నాలు కూడదని విన్నవించారు.