: 17 ఏళ్ల భారత విద్యార్థికి కోటి రూపాయల స్కాలర్ షిప్ ఆఫర్ చేసిన అమెరికా విద్యా సంస్థ
ఆ విద్యార్థి తమవద్ద చదివితే చాలని భావిస్తోందో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విద్యా సంస్థ. ఏకంగా కోటి రూపాయల స్కాలర్ షిప్ ఇస్తామని ఆఫర్ చేసింది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో 17 ఏళ్ల కాన్పూర్ విద్యార్థికి స్వాగతం పలుకుతోంది. ఇంజనీరింగ్ విద్య తమవద్ద చదవాలని కోరుకుంటోంది. కాన్పూర్ కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్న ఆయూష్ శర్మ టోఫెల్ ప్రవేశపరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో అతనికి కోటి రూపాయల ఉపకార వేతనం ఇస్తామని ఎంఐటీ ప్రకటించింది. ఈ సంవత్సరం ఇండియా నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ఎంఐటీకి ఎంపిక కావడం గమనార్హం.