: ఎకరాకి 20 వేల పరిహారమిస్తాం: కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకున్నారు. అంతర్గత విభేదాల అనంతరం పాలనపై దృష్టిపెట్టిన కేజ్రీవాల్, వడగళ్ల వానకు కుదేలైపోయిన రైతులకు భారీ తాయిలం ప్రకటించారు. దేశంలో ఎవరూ ఇవ్వని నష్టపరిహారం అందజేస్తామని ఆయన ఎన్నికల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వడగళ్ల వాన కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ, గోధుమ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వేల రూపాయల పరిహారం అందజేస్తామని అన్నారు. దేశంలో ఎవరూ ఇవ్వని పరిహారం ఇస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఆయన చెప్పారు. కాగా, ఢిల్లీలో 30 నుంచి 35 వేల మంది రైతులు ఉన్నట్టు సమాచారం.