: ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్దరిదీ ప్రపంచ బ్యాంకు అజెండానే: బీవీ రాఘవులు
ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇద్దరిదీ ప్రపంచ బ్యాంకు అజెండాయేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. విజయనగరంలో టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ బ్యాంకు విధానాలను వారిద్దరూ సొంత బ్రాండుగా వాడుకుంటున్నారని అన్నారు. కార్పోరేట్ శక్తులు కోరుకున్న విధంగా సంస్కరణల అమలుకు ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని, వారి విధానాలు సింగపూర్, జపాన్ వంటి దేశాలకు తప్ప రాష్ట్రాలకు, భారత దేశానికి శ్రేయస్కరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్పోరేట్ రంగంలో వచ్చిన అసంతృప్తివల్లే మోదీకి అధికారం వచ్చిందని ఆయన సూత్రీకరించారు.