: తలా ఓ చేయి...ఢిల్లీ భారీ స్కోరు 184/3


ఐపీఎల్ సీజన్-8లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు స్థాయికి తగ్గట్టు రాణించింది. జట్టులోని ఆటగాళ్లంతా తలా ఓ చేయి వేయడంతో 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి మయాంఖ్ అగర్వాల్ (37), శ్రేయస్ అయ్యర్ (40) శుభారంభం ఇచ్చారు. రాజస్థాన్ బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకున్న రంజీ జోడీ, భారీ స్కోరుకు పునాదులు వేసింది. ప్రణాళికా బద్ధంగా ఆడిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు యువీ (27), డుమిని (44), మాథ్యూస్ (27) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో మోరిస్ రెండు వికెట్లు తీయగా, తంబే ఒక వికెట్ తీసి సహకారమందించాడు. 185 పరుగుల విజయ లక్ష్యంతో రాజస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించింది.

  • Loading...

More Telugu News