: చంద్రబాబు విమానం లేట్... 3 గంటలు ఆలస్యంగా బీజింగ్ కు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని బృందం 3 గంటలు ఆలస్యంగా చైనా రాజధాని బీజింగ్ చేరింది. వాతావరణం అనుకూలించని కారణంగా ఆయన పర్యటన మూడు గంటలు ఆలస్యం అయినట్టు సమాచారం. బీజింగ్ లో ఆయనకు ఎంబసీ అధికారులు స్వాగతం పలికారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో చైనా నుంచి కొత్త పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతున్న సంగతి తెలిసిందే. చైనా పారిశ్రామికవేత్తలకు ఇక్కడి అవకాశాలను తెలియజెప్పేందుకు బాబు బృందం చైనా భాషలో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను తయారు చేసింది.