: పక్కా ప్రణాళికతో స్మగ్లర్లపై కాల్పులు... అనుమతి తీసుకున్న టాస్క్ ఫోర్స్ హెడ్... తమిళనాడు డీజీపీకి సమాచారం!


వారం రోజుల క్రితం తిరుపతి సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ పక్కా ప్రణాళికతో జరిగిందని తెలుస్తోంది. పెద్ద ఎత్తున కూలీలతో స్మగ్లర్ల రాకను పసిగట్టిన టాస్క్ ఫోర్స్ పెద్దలు కాల్పులు జరిపేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ హెడ్ (ఎర్రచందనం నిర్వహణ విభాగం) ఎం.కాంతారావు పోలీసు ఉన్నతాధికారులకు లేఖ పంపారు. వారి నుంచి అనుమతులు వచ్చిన తరువాతే ఇక ఉపేక్షించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కూలీలు వస్తే సహించేది లేదని, వారు లొంగిపోకుండా దాడులకు పాల్పడితే కాల్చిపారేస్తామని తమిళనాడు, కర్ణాటక డీజీపీలకు కూడా ఆయన లేఖలు పంపారు. "అపారమైన అటవీ సంపదను కాపాడే బాధ్యతను నాకు ఇచ్చారు. నా శాయశక్తుల నేను కృషి చేస్తున్నా" అని ఆయన అన్నారు. వచ్చింది దొంగలా, స్మగ్లర్లా, కూలీలా? అన్నది ప్రశ్న కాదు. అలా ఆలోచించే లోపే వారి దాడిలో కొందరు పోలీసుల ప్రాణాలు పోతాయని, తొలుత అడవిలో కూలీలుగా వచ్చి దారులు తెలుసుకుని వారు తదుపరి దశలో స్మగ్లర్లుగా మారుతున్నారని మరో పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తే పోలీసులు కాల్పులు జరపవచ్చని, ఎర్ర దొంగలు గొడ్డళ్ళతో తెగబడుతుంటే చూస్తూ ఉండాలా? అని మరో అధికారి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News